11 నెలల్లో.. 6గురు కెప్టెన్లు
గత 11 నెలల్లో భారత జట్టుకు ఆరుగురు కెప్టెన్లయ్యారు. టీ20 ప్రపంచకప్ తర్వాత నిరుడు నవంబరులో ద్రవిడ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు జులైలో శ్రీలంకలో పర్యటించిన జట్టుకు తాత్కాలికంగా కోచ్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి వివిధ సిరీస్‌లకు ధావన్, కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్, పంత్, హార్దిక్ పాండ్య (ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్) భారత జట్లకు నాయకులుగా ఉన్నారు.
దీనిపై స్పందించిన రాహుల్ ద్రావడ్.. ఇంతమందికి పగ్గాలు అప్పగించడమన్నది అనుకుని చేసింది కాదు. భారత్ చాలా మ్యాచ్‌లు ఆడుతుండడం ఇలా జరగడానికి కారణం. మరింత మంది నాయకులను తయారు చేసేందుకు మాకు అవకాశాలు లభించాయని ద్రవిడ్ చెప్పాడు. మరింతగా మెరుగయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నామని అన్నాడు. ఐపీఎల్ ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన పేస్ బౌలర్లు వెలుగులోకి రావడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది భారత క్రికెట్‌కు శుభసూచకమని చెప్పాడు. ఇక దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగాల్సిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ 2-2 సమం అయింది.