పంజాబీ అమ్మాయిని ప్రేమించా.. కానీ !

హీరో అడవి శేష్ రాముడు ఏమీ కాదు. రొమియోనే. కొన్ని యవ్వారాలు నడిపాడు. ఈ విషయాన్ని స్వయంగా శేష్ ను తెలిపారు. ఆయన నటించిన మేజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేషు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“యూఎస్‌లో నివసిస్తున్న ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాలతో మా రిలేషన్‌ బ్రేకప్‌ అయ్యింది. అది కూడా నా పుట్టినరోజు నాడే ఆమె పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత రిలేషన్స్‌లో ఉన్నాను కానీ.. పెళ్లి వరకూ తీసుకెళ్లే ధైర్యం రాలేదు. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాలపైనే” అన్నారు శేష్. ఇక, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌..? అని ఇంట్లోవాళ్లు అడిగి కాస్త విసిగిపోయారు. ప్రస్తుతం వాళ్లు మా చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు.