చైతూకి కొత్త తోడు.. సమంత రియాక్షన్ !
నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఎవరు బతుకు వారు బతుకుతున్నారు. అయితే అప్పుడే చైతూ కొత్త తోడును వెతుక్కున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా చైతూ – శోభిత ధూలిపాళ ఇద్దరూ టచ్లో ఉన్నారని, ఇద్దరూ కలిసే ఉంటున్నారని, ఇటీవల జరిగిన శోభిత పుట్టిన రోజు వేడుకలకు హాజరైన అతికొద్దిమంది సన్నిహితులత్లో చైతూ ఒకడని ఇన్ సైడ్ వర్గాల టాక్. వీరి బంధం పై ఓ వెబ్ సైట్ రాసిన క్లియర్ కట్ కథనంపై సమంత స్పందించింది.
‘ఇది జీవితం. కొన్నింటిని వదులుకొని ముందుకు సాగిపోవాలి. నేనైతే నాగ చైతన్యను దాటేసి ముందుకు వెళ్తున్నాను. మీరు కూడా ప్రచారాలని పట్టించుకోకుండా పని చూసుకోండి’ అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు సమంత. నిజంగా సామ్ గత జీవితాన్ని వదిలేసింది. సినిమాలపై ఫోకస్ పెట్టింది. జాతీయ స్థాయిలో మంచి నటి అనిపించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు.. పలు బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. మరోవైపు, కమర్షియల్ యాడ్స్ , ఫోటో షూట్స్ దేన్ని వదలడం లేదు.