పవన్ డైరెక్టర్ తో నితిన్ సినిమా

భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్రకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్. నితిన్ ప్ర‌స్తుతం మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గంతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత‌…. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడు. ఇప్ప‌టికే వ‌క్కంతం వంశీ సినిమా మొద‌లైపోయింది. కొంత‌మేర షూటింగ్ జ‌రిగింది. మాచ‌ర్ల… ప‌నులు పూర్త‌యిన వెంట‌నే.. త‌న డేట్ల‌న్నీ.. వ‌క్కంతం సినిమాకి కేటాయిస్తాడు. సెప్టెంబ‌రు నుంచి సాగ‌ర్ చంద్ర సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు ఉన్నాయి.

భీమ్లా నాయక్ తో హిట్ కొట్టిన సాగర్ చంద్రని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ? భీమ్లా నాయక్ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లింది. ఇంకొంచెం ఉంటే అది థమన్ నేపథ్య సంగీతానికి, రానా విలనీజాన్ని దక్కింది. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సాగర్ చంద్ర అన్యాయమే అయిపోయాడు. కానీ అతడి ప్రతిభను నితిన్ గుర్తించాడు. అవకాశం ఇచ్చినట్టు తెలిసింది.