6 నైట్స్‌ సరిపోవా ?

నిర్మాతగా వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ? , మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు ఎం. ఎస్ రాజు. వాన సినిమాతో దర్శకుడిగా మారారు. గత ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘డర్టీ హరి’ యూత్ ని ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో మరోసారి యూత్ ని టార్గెట్ చేస్తూ ఎం. ఎస్ రాజు తెరకెక్కించిన సినిమా ‘7 డేస్‌ 6 నైట్స్‌’. జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సరికొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యూత్ ను ఆకట్టుకునేలా ట్రైలర్ ను కట్ చేశారు.

మరోవైప ఈ సినిమాలో  హీరోయిన్ గా నటించిన మెహర్‌ చాహల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. స్పెషల్ గా ఫోటో షూట్ చేసింది. అవి చూసిన జనాలు.. ఈ ముద్దుగుమ్మతో 6 నైట్స్ సరిపోవంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే మెహర్ చాహల్ బాగుంది. సన్నజాజిలా లా ఉంది. తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకునే కనబడుతుంది.