మదర్ లవ్ : కొడుకుతో కాజల్

చందమామ కాజల్ ఇటీవలే తల్లయిన సంగతి తెలిసిందే. పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నోడు నీల్ కిచ్లు అనే పేరు పెట్టుకున్నారు. అయితే చిన్నోడి ఫస్ట్ లుక్ ను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలు చాలానే అభిమానులతో పంచుకుంది కాజల్. ఇందులో బాబు ఫోటో స్పష్టంగా కనబడకుండా జాగ్రత్తపడింది.

తాజాగా షేర్ చేసిన ఫోటోలో కొడుకును ముద్దు చేస్తూ కనిపించింది. ఇందులో సైడ్ లుక్ లో చిన్నోడిని చూపించింది. ఇక త్వరలోనే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి నుంచే ఫిట్నెస్ పై ఆమె ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.