అర్జున్ కూతురు ప్రేమలో విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య ప్రేమలో పడ్డాడట. వీరిద్దరిని సెట్ చేసింది స్వయంగా అర్జున్ నేనట. కన్ఫూజన్ ఏమి లేదు. అర్జున్ స్వంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15 సినిమా తెలుగులో నిర్మిస్తున్నారు.

అర్జున్ నిర్మించే ఈ సినిమాతో ఆయన కుమార్తె ఐశ్వర్య తెలుగులో కథానాయికగా పరిచయం కాబోతోంది. విశ్వక్ సేన్ హీరో.  రోడ్ మూవీ కాన్సెప్ట్ తో తయారు కాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది