సుప్రీంకోర్టు షాకింగ్ జ‌డ్జిమెంట్..!!

ఢిల్లీలో గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సుప్రీం తీర్పు వెల్ల‌డించింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ , డిల్లీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య విభేదాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో 5గురు సభ్యుల ధర్మాసనం లో సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించింది. లెఫ్టినెంట్ గవర్నర్ డ్రల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడితే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రపతి పై ఉంద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది.

ఢిల్లీ క్యాబినెట్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేయాల్సి ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రత్యేక స్వతంత్ర అధికారాలు లేవని, ఢిల్లీ క్యాబినెట్ సలహా మేరకు పనిచేయాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. కొన్నిఅంశాలకు సంబంధించిన వాటిలో మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పింది. గవర్నర్ కు,ఆయన అధికారాల‌కు సుప్రీంకోర్టు పరిమితులు విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.