సినీ కార్మికులు.. సమ్మె బాట, రేపట్నుంచి షూటింగులు బంద్ !

కరోనా ఒకటి, రెండు, మూడు దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. రేప‌టి నుంచి షూటింగుల‌కు రామంటూ… సినీ కార్మికులు బంద్‌కి పిలుపునిచ్చారు. త‌మ వేత‌నాలు పెంచేవర‌కూ షూటింగుల్లో పాల్గొన‌మ‌ని ఫెడ‌రేష‌న్‌కి లేఖ అందించారు. అంతేకాదు… రేపు అంటే బుధ‌వారం ఫెడ‌రేష‌న్ ని ముట్ట‌డించాల‌ని కార్మికులు నిర్ణ‌యించారు.

గత కొంత కాలంగా త‌మ వేత‌నాలు పెంచాల‌ని సినీ కార్మికులు ఫెడ‌రేష‌న్‌పై గ‌ట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విష‌యంలో ఫెడ‌రేష‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దాంతో కార్మికులంతా ఇప్పుడు స‌మ్మెకు పిలుపునిచ్చారు. ఇక సినీ కార్మికుల సమ్మె పిలుపుపై నిర్మాత‌లు అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.