సినీ కార్మికుల సమ్మె : 10 రోజుల సమయం కోరిన నరేష్
సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి షూటింగ్ లు బంద్ అయినవి. సినీ కార్మికుల సమ్మెపై నటుడు నరేశ్ స్పందించారు. కరోనా కారణంగా మూడేళ్ల నుంచి చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోందని, ఇలాంటి సమయంలో సమ్మెబాట పట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ మేర నరేశ్ కొన్ని వీడియో షేర్ చేశారు.
“కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంతోపాటు సినీ పరిశ్రమ కూడా దెబ్బతింది. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. ఇండస్ట్రీ బిడ్డగా నేను కోరేది ఒక్కటే.. నిర్మాతలు కూడా కరోనా సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వడ్డీలు కట్టలేని పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాస్త స్థిరపడుతున్నారు. ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఒక వారం లేదా పదిరోజులు సమయం తీసుకుని, ఫెడరేషన్, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు. కృష్ణానగర్, ఫిలింనగర్‌కు ఉన్న దూరం 3 కిలోమీటర్లు. అందరం కలిస్తేనే ఒక కుటుంబం. అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకువస్తాం” అన్నారు నరేష్.
But we should remember that the majority of the TFI mainly the families of small technicians & actors went without food & medication & the producers suffered severe financial setbacks & just recuperating. Almost 20 units are in outdoor locations.
(2/3) pic.twitter.com/VzgQzE3ewF— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022