రెయిన్ అలర్ట్ : బయటకు రావొద్దు

 

అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్‌ఎంసీ హెచ్చరించింది. మంగళవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తంగా ఉంచింది. సికింద్రాబాద్, అల్వాల్‌, నెరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 

మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.