సాయి పల్లవి ఓటీటీ ఆశలు

‘విరాటపర్వం’ సినిమాపై హీరోయిన్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కానీ అవి నెరవేరలేదు. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి-సాయి పల్లవి జంటగా ‘విరాటపర్వం’ తెరకెక్కింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా చూసేశాం. అద్భుతంగా వచ్చింది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ఇరగదీసింది. ఆమెకు జాతీయ అవార్డు ఖాయమని విక్టరీ వెంకటేష్ లాంటోళ్లు బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ జూన్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన విరాటపర్వం వెంకీ చెప్పిన రేంజ్ లో లేదని ప్రేక్షకులు తీర్పునిచ్చారు. 

నిజంగా వెన్నెల పాత్రను దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అయితే కథ బాగున్నా.. కథనం గ్రిప్పింగ్ గా లేకపోవడంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో విరాటపర్వం మంచి సినిమా అనిపించుకున్నా.. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. హిట్ సినిమా అనిపించుకోలేదు. అయితే థియేటర్స్ లో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. జులై 1న విరాటపర్వం ఓటీట్రీలో రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో విరాటపర్వం ఓటీటీలో బాగా ఆడుతుందని సాయి పల్లవి ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.