దాతలు దొరికితే మీనా భర్త బతికెటోడు
సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు కరోనా రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీంతో వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని సూచించారట. అయితే దాతలు దొరక్కపోవడంతోనే విద్యాసాగర్ మృతి చెందారని సమాచారం.
మరోవైపు పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.