ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష !
సుప్రీంకోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది.విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశాలను సుప్రీం సమర్థించింది. దీంతో గురువారం ఉదయం 11గంటలకు ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఏక్నాథ్ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం రేపు సాయంత్రం 5గంటల లోపు బలపరీక్ష ఎదుర్కోవాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఠాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. దీంతో ఠాక్రే ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన బెంచ్ దాదాపు మూడున్నర గంటల పాటు విచారణ జరిపింది. ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం రేపే బలం నిరూపించుకోవాలని తీర్పునిచ్చింది.