హైస్కూల్ స్వీట్ హార్ట్ తో రామ్ పెళ్లి
ఎనర్జిటిక్ హీరో రామ్ పెళ్లి కూడా ఫిక్స్ చేశారు నెటిజన్లు. హైస్కూల్ స్వీట్ హార్ట్ తో రామ్ ప్రేమలో పడ్డారు. స్కూల్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్నాడు అంటూ కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారం పై రామ్ స్పందించారు.
“ఓరి దేవుడా.. ఆపండి బాబూ.. ఈ పుకార్లు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. చివరికి నేను నా సొంత కుటుంబానికి, స్నేహితులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సీక్రెట్ హైస్కూల్ స్వీట్ హార్ట్ అంటూ ఎవ్వరూ లేరు. నేను అలాంటి అమ్మాయిని ఎవ్వర్నీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, నేను హైస్కూల్ కు సరిగ్గా వెళ్లిందే లేదు” అంటూ పుకార్లను ఖండించాడు రామ్.
ప్రస్తుతం రామ్ ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా జెండా పాతేయాలని గట్టిగా కోరుకుంటున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పారని టాక్. ఇది కూడా తెలుగు, తమిళ్ లో తెరకెక్కనుంది.