గౌరవమా ? వ్యూహాత్మకమా ?

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్, ఆయన సర్కార్ పై పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిపై మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. కేసీఆర్ ను ప్రధాని తిట్టలేదు. భీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటే అని కొందరు అంటున్నారు. మరోవైపు ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

దేశ్ కి నేత అనిపించుకోవడానికి సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆయన్ని నేరుగా విమర్శిస్తే.. విరుచుకుపడితే ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది. అది ఇవ్వడం ఇష్టం లేకే కేసీఆర్ ను మోడీ పట్టించుకోలేదని అంటున్నారు. ఇందులో ఏది నిజమో.. కాదో.. పక్కన పెడితే.. కేసీఆర్ ను మోడీ టార్గెట్ చేయకపోవడంతో బీజేపీ సభ సప్పగా ముగిసినట్టు అనిపించింది.