రాధిక లేకుండానే.. డీజే టిల్లు 2 !

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, త‌న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ.. ఇవే ఈ సినిమా స‌క్సెస్‌కి ప్ర‌ధాన కార‌ణాలు. 

ఇటీవలే నిర్మాత నాగ వంశీ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే సీక్వెల్ లో కీలక మార్పులు చేశారని సమాచారం. డీజే టిల్లులో టిల్లుతో పాటు.. రాధిక క్యారెక్ట‌ర్ కూడా చాలా కీల‌కం. ఈ పాత్ర‌లో నేహా శెట్టి క‌నిపించింది.అయితే డీజే టిల్లు 2లో నేహా శెట్టి హీరోయిన్ కాదట. ఆమె స్థానంలో మరో గ్లామరస్ హీరోయిన్ కనిపించనుందట. నేహా శెట్టిని గెస్ట్ రోల్ కి పరిమితం చేయనున్నారని తెలిసింది. అయితే రాధిక పాత్రకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ పాత్ర లేకుండానే డీజే టిల్లు అంటే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా నెగటివ్ టాక్ మొదలైనట్టే కనిపిస్తుంది.