రణ్ బీర్-వాణీ కపూర్ రొమాన్స్.. పీక్స్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వాణీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. దానికి కారణం ఆమె అందమే. సన్నజాజిలా ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి సినిమాల్లో, బయట కూడా గ్లామర్ షో చేయడానికి వెనుకాడదు.

గత ఏడాది ‘బెల్ బాటమ్’, ‘చండీగఢ్ కరే ఆషికి’ సినిమాలతో సందడి చేసింది. ఈ ఏడాది రణ్ బీర్ కపూర్ కి జంటగా ఆమె నటించిన ‘షంషేరా’ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 1871లో సాగే ఈ కథ సంజయ్ దత్ వర్సెస్ రణ్ బీర్ ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

ఇక రణ్ బీర్ తో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది వాణీ కపూర్. ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోయారు. వాణీ అయితే హాట్ కనిపించింది. ఎద అందాలను ఆరబోసింది. ఈ జంట కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే రణ్ బీర్ వైఫ్ అలియా భట్ కుళ్లుకునేలా ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోయారు.