ఇంగ్లాండ్ గెలుపు.. సిరీస్ సమం
ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ ను టీమిండియా ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఇంగ్లీష్ బ్యాటర్ల పట్టుదలతో విజయం వారినే వరించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు. మంగళవారం 259/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట కొనసాగించిన వీరిద్దరు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోరూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19×4, 1×6), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో 15×4, 1×6) శతకాలతో అదరగొట్టారు. దీంతో టెస్టుల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక ఛేదనగా రికార్డు విజయం అందించారు. మరోవైపు ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.
టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ : 416 ఆలౌట్, పంత్ 146, జడేజా 104.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 284 ఆలౌట్, బెయిర్ స్టో 106, బిల్లింగ్స్ 36.
టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్ : 245 ఆలౌట్, పుజారా 66, పంత్ 57.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 378/3, రూట్ 142, బెయిర్ స్టో 114.