అచ్చేదిన్ ఆగయా.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.50మేర పెంచిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మంచి రోజులు వచ్చేశాయ్ (అచ్చేదిన్ ఆగయా).. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు” అని సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
తాజాగా పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,055 నుంచి రూ.1,105కు చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతుండటంతో.. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.