శంకర్-ఎన్టీఆర్-దిల్ రాజు.. ఆల్ సెట్ !

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి  తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా కోసం సిటిజన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత శంకర్ ఇండియన్ 2 సినిమా చేయాల్సి వుంది. విక్రమ్ సినిమా హిట్ కావడంతో మళ్లీ కమల్ హాసన్ కు క్రేజ్ కనిపిస్తోంది. అందుకే ఇండియన్ 2 ప్రాజెక్టు ముందుకు వస్తోంది. తమిళంలో ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసేందుకు ఉదయానిధి స్టాలిన్ ముందుకు వచ్చినట్లు టాక్.

ఇదిలావుండగా.. రామ్ చరణ్ సినిమా తర్వాత శంకర్ తో మరో తెలుగు చేయించాలని నిర్మాత దిల్ రాజు చూస్తున్నారు. ఎన్టీఆర్ కాంబినేషన్ లో శంకర్ తో సినిమా చేయించాలన్నది ఆయన కోరిక అని తెలుస్తోంది. ఓ లైన్ కూడా అనుకున్నారట. ఒకవేళ ఇండియన్ 2 మళ్లీ పట్టాలు ఎక్కితే ఎన్ టీఆర్ శంకర్ కాంబోలో సినిమా లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా.. లేట్ అవ్వొచ్చు. ఇండియన్ 2 లేనట్టయితే ఎన్ టీఆర్ – శంకర్ -దిల్ రాజు కాంబోలో సినిమా పడే ఛాన్స్ ఉంది.