మరోసారి ప్రేమలో ఇలియానా
ఒక్కప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఖాతాలో ప్రేమకథలకు లోటు లేదు. ఇది వరకు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమకథను నడిపించింది. చాలా కాలమే సహజీవనం చేసింది. ఒక దశలో ఇలియానా ప్రెగ్నెంట్ అనే ఊహాగానాలూ వినిపించాయి. వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని, పెళ్లే తరువాయి అనే వార్తలూ వచ్చాయి. కానీ ఈ జంట విడిపోయింది.
అంతకంటే ముందు ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడినట్టు స్వయంగా ఇల్లీనే చెప్పింది. గత కొన్నేళ్లుగా సినిమాలను పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా జాలీగా గడుపుతున్న ఇల్లీ.. మళ్లీ ప్రేమలో పడినట్టు టాక్. అతడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ సోదరుడు సెబాస్టియన్. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. కొన్ని సార్లు కెమెరా కంటపడటం జరిగాయి. ఐతే ప్రస్తుతం కత్రినా ఫ్యామిలీ ఫారిన్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. వీరితో కలిసి ఇల్లీ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయింది. దీంతో.. కత్రినా సోదరిడితో ఇల్లీ డేటింగ్ వ్యవహారంపై మరింత క్లారిటీ వచ్చినట్టయింది.