ప్రియాంక @40

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఈ ముద్దుగుమ్మ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ప్రియాంకను విష్ చేశారు. ఈ సందర్భంగా త్రో బ్యాక్ పేరిట ప్రియాంక అరుదైన ఫోటోలు, వీడియోలు వీడియోలు చేశారు. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ కు బోలేడు గిఫ్ట్స్ లభించినట్టయింది.

హాలీవుడ్ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ప్రియాంక. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది.  ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియా భట్‌లతో కలిసి ‘జీ లే జరా’లో నటించనుంది. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే ముగ్గురు హీరోయిన్స్ కాల్షీట్లు ఒకే టైమ్ లో సెట్ కావడం లేదు. ప్రస్తుతం అలియా ప్రెగ్నెంట్.. మరికొద్దిరోజుల్లో ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనుంది. ఈ నేపథ్యంళో జీ లే జరా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.