అగ్గి రాజుకుంది.. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయాలట !

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఏదో విధంగా ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం కామన్ గా మారింది. ఈసారి అలాంటి ప్రయత్నాలు వర్కవుట్ కావేమో అనుకున్నారంతా. కానీ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెల్లగా అగ్గి రాజేశారు.  ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పువ్వాడ..  ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కొన్ని గంటల గ్యాప్ లోనే పువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. దీంతో మరోసారి ఏపీ-తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం షురూ అయినట్టు కనబడుతుంది.