1 డాలర్‌ = రూ.80

అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మంగళవారం రూ.80 మార్క్‌ను తాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రూపాయి విలువ 25 శాతం మేర క్షీణించింది. 2014 డిసెంబర్‌ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా.. 2022 జులై 11 నాటికి అది 79.41కి చేరింది.

ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు రూపాయి 7 శాతం వరకు క్షీణించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్‌ (Dollar) మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు, రూ.79కి పరిమితం కావచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి.