పుష్ప 3 పాజిబుల్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్. ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటించారు. గత ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ప్రభంజనం సృష్టించింది.  పాటలు, ఫైట్లు.. డైలాగులు.. ఇలా ప్రతి ఒక్కటి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 


ఇప్పుడు పుష్ప 2 కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. పార్ట్-2లో కొన్ని కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పార్ట్-3 కూడా పాజిబుల్ పుష్ప అనేశారు ఫహాద్ ఫాసిల్. కేరళలో ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. పుష్ప 3 కూడా ఉండొచ్చు. ఎందుకంటే.. సుకుమార్ దగ్గర మెటీరియల్ ఉందని చెప్పుకొచ్చారు.

పుష్ప 3 పై సమాచారం ఉండటం వలనే ఫాసిల్ ఓపెన్ అయి ఉంటారని అంటున్నారు. అయితే పుష్ప 3 ఉంటుందా ? ఉండదా ? అన్నది పుష్ప 2 ఫలితం పై ఆదారపడి ఉంది. సెప్టెంబర్ నుంచి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో పుష్ప 3 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

#Sukumar sir has enough materials to make #Pushpa3#FahadhFaasil said in interview of Manish Narayanan 🔥#AlluArjun pic.twitter.com/3ROQLtoqIv— OTTRelease (@ott_release) July 20, 2022