బబ్లీ బౌన్సర్ : తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్స్

మధు బండార్కర్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘బబ్లీ బౌన్సర్’. షూటింగ్ పూర్తయింది. ఇటీవల షూటింగ్ ఆఖరి రోజున చిత్రబృందం తో దిగిన ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని తెలిపింది. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. బ్యాక్ & ఫ్రంట్ లుక్ లో తమ్మూని ప్రజెంట్ చేశారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ సినిమా డిస్నే ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక తమన్నా నటిస్తున్న మరో రెండు హిందీ సినిమాలు బోలే చుడియన్, ప్లాన్ ఏ ప్లాన్ బి షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో మిల్కీ బ్యూటీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం మూడు సినిమాలు.. భోళా శంకర్, ఎఫ్ 2, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది. గ్లామర్ ఫీల్డ్ లో అందం ఆవిరైతే అవకాశాలు కనుమరుగవుతాయి. ఈ సంగతి బాగా తెలిసిన ముద్దుగుమ్మలు జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తారు. అయితే తమన్నా మొదటి నుంచి అందం, ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుంటోంది. అందుకే దశాబ్దానికి పైగా హీరోయిన్ గా .. అది కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.