లైగర్ స్పెషల్.. విజయ్ కి నత్తి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ ట్రైలర్ వచ్చేసింది. ఊహించినట్టే అదిరిపోయింది. పూరి మార్క్ హీరోయిజం కనిపించింది. పూరి మార్క్ టేకింగ్, డైలాగ్స్, విజయ్ నటన.. అన్ని అదిరిపోయాయ్. రమ్యకృష్ణ పవర్ రోల్ లో కనిపించనుంది. ఆమె సినిమాకు గుండెకాయ అని ట్రైలర్ తో అర్థమైంది. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో జయసుధ టైపు క్యారెక్టర్ అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఒక్కటే ఒక్క విషయం ప్రేక్షకులను షాకింగ్ కి గురి చేసింది. అదే విజయ్ దేవరకొండకు నత్తి.

దాన్ని సినిమా వరకు దాచి పెట్టలేదు పూరి. ట్రైలర్ లోనే చూపించేశాడు. నత్తితో కూడిన సాగదీసే డైలాగ్ లను ఒకట్రెండు ట్రైలర్ లో చూపించారు. అయితే నత్తి నే సినిమాలో స్పెషల్ గా ఉంటుందని సమాచారం. పూరి సినిమాలో హీరోల పొటెన్షియల్ గురించి తెలిసిందే. దానికి వంద రెట్లు అన్నట్టుగా లైగర్ లో విజయ్ పాత్రను డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ‘‘ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డ’’  అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌ అదిరిపోయాయి. డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.. ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంది.