చైతూ కంటే నితిన్ తక్కువా ?

కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పకున్నా సీన్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కి నితిన్ అంటే భయం లేదు. కానీ నాగ చైతన్య అంటే భయపడిపోతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. ?

చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘కార్తికేయ‌ 2’. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. చాలాసార్లు రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వచ్చిన ఈ సినిమా జులై 22కి ఫిక్సయింది. ఇప్పుడు.. ఈ డేట్ ను కూడా వదులుకొని.. ఆగస్టు 12 కి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ? జులై 22న నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ వస్తోంది. ఆయనకు దారిస్తూ.. నిఖిల్ తప్పుకున్నాడు. అయితే ఆగస్టు 12న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ కానుంది. ఆ విషయం తెలిసి కూడా నితిన్ తో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయిపోయాడు నిఖిల్. దీంతో నిఖిల్ కి చైతూ అంటే భయం. కానీ నితిన్ అంటే లెక్కలేదా ? అనే చర్చ మొదలైంది. 

అయితే ఇక్కడ విషయం ఏంటంటే ? థ్యాంక్యూ నిర్మాత దిల్ రాజు. ఆయన సినిమా వస్తుందంటే.. మిగితా సినిమాలు సైడైపోవాల్సిందే. థియేటర్స్ మీద ఆయన పెత్తనం చాన్నాళ్ల నుంచి కొనసాగుతుంది. కాదు.. కూడదని పోటీకి దిగితే.. థియేటర్స్ దక్కదు. అప్పుడు అసలుకే ఎసరు. నితిన్ సినిమాతో పోటీకి పోయినా.. కొన్ని థియేటర్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. బహుశా.. అందుకే చైతూతో కయ్యం కంటే నితిన్ తో పోటీ బెటర్ అని భావించి ఉంటారు.