జాక్వెలిన్ Too హాట్

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్, ఫోటో షూట్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాములుగానే ఈ బ్యూటీ రెచ్చిపోతుంటుంది. హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తుంటుంది. అలాంటిది.. ఓ హాలీవుడ్ సినిమా ప్రీమియర్ ముంబైలో జరిగితే.. ఆగుతుందా.. ? ఓ రేంజ్ లో రెచ్చిపోదు. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ది గ్రే మేన్ ప్రీమియర్ షోలో జాక్వలిన్ అదే చేసింది.

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ The Gray Man జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ది గ్రే మేన్ చిత్ర యూనిట్ ఇండియాకు వచ్చింది. ధనుష్ తో కలిసి ముంబైలో ప్రీమియర్ షో వేసింది. దీనికి బాలీవుడ్ స్టార్స్ ను ఆహ్వానించింది. అమీర్ ఖాన్, వికీ కౌశల్. జాక్వలిన్ తదితరులు హాజరయ్యారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ హాలీవుడ్ ఫంక్షన్ ను తలపించింది. మరీ స్పెషల్ గా జాక్వెలిన్ గ్లామర్ షో హైలైట్  అయింది.

ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది జాక్వలిన్. ఇప్పటికే బచ్చన్ పాండే, ఎటాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. యావరేజ్ అనిపించుకున్నాయి. జులై 28న ‘విక్రాంత్ రోనా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబర్ లో రామ్ సేతు, డిసెంబర్ లో సర్కస్ రిలీజ్ కానున్నాయి.