కాస్త బ్రేక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరల పెరుగుదలకు నెలరోజుల పాటు బ్రేక్ పడిన సంగతి తెలిసింది. ఇప్పుడీ బ్రేక్ టైం ముగిసింది. మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. దాదాపు 36 రోజుల అనంతరం మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ పై 16 నుంచి 17 పైసల చొప్పున పెరుగగా, డీజిల్‌ ధరలు 10 నుంచి 12 పైసల చొప్పును ఎగిశాయి.

గత నెల రోజుల్లో పెట్రోల్‌ ధరలు 22 సార్లు, డీజిల్‌ ధరలు 18 సార్లు తగ్గించారు. ఐతే, పెంచేటప్పుదు రూపాయి. అదే తగ్గించేటప్పుడు పైసా ఫార్ములాని ఫాలో అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా వీస్తున్న ఆందోళనకర పరిస్థితులతో దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైనట్టు తెలిసింది.