సాగర్ లో నిమజ్జనానికి నో
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది.
వాస్తవానికి గత ఏడాది పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గణేష్ మూర్తి కళాకార్ సంఘ్ కోర్టుకు వెళ్లారు. అయితే కొవిడ్‌కు ముందు తయారు చేసిన విగ్రహాల అమ్మకం వద్దనడం సరైనది కాదు. అది కళాకారులపై దాడి చేసినట్టు అనుమతి ఇచ్చింది. అదే విధంగా తగిన సమయం లేకపోవడంతో.. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈసారి హైకోర్టు ముందే హెచ్చరికలు చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.