OTTRelease 75 రోజుల తర్వాత ?
ఓటీటీల హవా మొదలైంది. దీంతో థియేటర్ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టు 1వ నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్న తరుణంలో ఓటీటీల్లో త్వరగా సినిమాలను విడుదల చేయటమూ ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని పట్టుబడుతున్నారు.
ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు క్రమంగా థియేటర్‌లకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దానికి తోడు థియేటర్ లో రిలీజైన సినిమా రెండు వారాలు తిరిగే సరికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. న్నో అంచనాల మధ్య విడుదలైన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ తదితర చిత్రాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చాయి. కొన్ని చిన్న చిత్రాలైతే వారానికే ఓటీటీ బాటపట్టాయి. ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కేజీయఫ్2’, ‘సర్కారువారి పాట’, ‘ఎఫ్3’, ‘విక్రమ్’ వంటి వాటిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమాలన్నీ 45 రోజుల తర్వాత ఓటీటీ బాట పట్టాయి.
ఇప్పుడు నిర్మాతల స్ట్రైక్ తో ఓటీటీలపై షరతులు పెరగవచ్చు. అయితే దీని వలన మంచి, చెడు రెండూ ఉన్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఎలాగూ సేఫ్. కానీ మిక్సిడ్ టాక్, ప్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినా.. ఒకట్రెండు వారాల్లో ఓటీటీలోకి వస్తే మంచి వ్యూస్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఖిలాడీ, అంటే సుందరానికి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఓటీటీపై రిలీజ్ పై నిర్మాతలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో !