టెక్.. తెలంగాణ టాప్ లో !
తెలుగు రాష్ట్రాల విషయంలో సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. ఆగమైతది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి చెందదు. కరెంట్, నీళ్లు పంచాయతీ అయితది. నక్సల్స్ ప్రభావం పెరుగుతుంది. టెక్నాలజీ విషయంలో వెనకబడతది అని అప్పటి నేతలు మొత్తుకున్నారు. అయితే ఇప్పుడు ఏరుబడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాష్ట్రాలు వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభ ఆధారంగా ఇస్తున్న ర్యాంకుల్లో తెలంగాణ పైపైకి వెళ్తోంది. ఏపీ దిగువకు వెళ్లిపోతోంది.
ముఖ్యంగా టెక్ రంగంలో ఏపీ దిగజారిపోతోంది. ఇటీవల స్టార్టప్స్ ఎకోసిస్టం విషయంలో ఇచ్చిన ర్యాంకుల్లో దేశంలోనే అట్టడుగున ఉంది. తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. తాజాగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కూడా అదే పరిస్థితి. గతంలో ఉన్న మెరుగైన స్థానాలను ఏపీ పొగొట్టుకుంటే.. తెలంగాణ పైకి వెళ్తోంది. సృజనాత్మకత, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, హ్యూమన్ ఇండెక్స్… వంటి ఆంశాల ఆధారంగా ఎంపిక చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అన్ని రంగాలను సగటున పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమ పనితీరు కనబర్చిన ‘బెస్ట్ పర్‌ఫార్మర్ స్టేట్’గా తెలంగాణకు మొదటి ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచింది. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ పని తీరు ఇందుకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.