యాపిల్ #iOS16 ఫీచర్లు

సెప్టెంబరులో యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ 16ను విడుదల చేయనుంది. తాజాగా ఐఓఎస్‌ 16 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఏడు సరికొత్త ఫీచర్లతో ఐఓఎస్‌ 16 అందుబాతులోకి రానుంది. యూజర్‌ తనకు నచ్చినట్లుగా స్క్రీన్‌, విడ్జెట్స్‌, నోటిఫికేషన్‌ బార్‌ సెక్షన్స్‌లో ఆండ్రాయిడ్ తరహాలో కస్టమైజబుల్ ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది.

  • ఎట్టకేలకు యాపిల్ యూజర్లు తమకు నచ్చిన రంగులోకి లాక్‌స్క్రీన్‌ను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. లాక్‌స్క్రీన్‌ కస్టమైజేషన్‌లో భాగంగా యాపిల్ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. యూజర్స్‌ లాక్‌స్క్రీన్‌ మీద క్లాక్‌ను వివిధ ఫాంట్‌లు, రంగులు ఉపయోగించి తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.  
  •  ఐఓఎస్‌ 16లో యూజర్లు ఐమెసేజ్‌లో పంపిన మెసేజ్‌లను ఎడిట్‌, అన్‌సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల లోపు మెసేజ్‌లో మార్పులు చేయడంతోపాటు, దాన్ని అన్‌సెండ్‌ చేసుకునే ఫీచర్‌ ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఐఓఎస్‌ 16లో మెసేజ్‌ ఎడిట్ చేసినట్లు అవతలి వారికి తెలియదు.  
  • ఐఓఎస్‌ 16లో మ్యూజిక్ ప్లేయర్‌ ఆన్‌ చేసిన వెంటనే ఫోన్‌ లాక్‌ పడినా, ఫుల్‌ స్క్రీన్‌లో మ్యూజిక్ ప్లేయర్ కనిపిస్తుంది. దానికి తగినట్లుగా లాక్‌ స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ కూడా మారుతుంది.  
  • ఐక్లౌడ్ ఫొటో లైబ్రరీ – ఐఓఎస్‌ 16లో యూజర్లకు ఉపయోగపడే ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు ఫొటోస్ యాప్‌లో తనతో పాటు మరో ఐదుగురితో కలిసి ఐక్లౌడ్‌లోని ఫొటోలను షేర్, ఎడిట్‌, డిలీట్‌ చేసుకునేందుకు యాడ్‌ చేసుకోవచ్చు.
  •  యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ 16లో గేమింగ్ ప్రియుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో మరిన్ని బ్లూటూత్ గేమింగ్ కంట్రోల్స్‌ యూజర్లు ఉపయోగించవచ్చు. వీటిలో నిన్‌టెండో జాయ్-కాన్స్‌ అండ్‌ ప్రో కంట్రోలర్‌ ఉన్నాయి.  
  • ఐఓఎస్‌ 16లో బిల్ట్‌-ఇన్‌ ఆర్డర్‌ ట్రాకింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులో ప్యాకెజీ డెలివరీకి సిద్ధమయిందా? ఏ తేదీన డెలివరీ అవుతుంది? వంటి వివరాలను అంచనా వేసి యూజర్‌కు తెలియజేస్తుంది.  
  • ఐఓఎస్‌ 16 ఓఎస్‌తో ఫిట్‌నెస్‌ యాప్‌ను అన్ని ఐఫోన్ మోడల్స్‌ యూజర్లకు పరిచయం చేస్తున్నారు. గతంలో యాపిల్‌ వాచ్‌ ఉపయోగించే యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉండేది.