రౌడీ సింపుల్ సిటీకి బాలీవుడ్ ఫిదా

పూరి జగన్నాథ్ – రౌడీ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లు ఉదయం హైదరాబాద్‌, సాయంత్రం ముంబయిలో ఎంతో వేడుకగా జరిగింది.

ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో బీటౌన్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే.. ఈ వేడుకకు విజయ్‌ దేవరకొండ చాలా సింపుల్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌, చెప్పులు వేసుకుని హాజరయ్యారు. ఈ విషయాన్ని గమనించిన రణ్‌వీర్‌ సింగ్‌ ఆయన స్టైల్‌ని మెచ్చుకున్నారు. అంతేకాదు.. విజయ్, రణ్ వీర్ ఒకరినొకరు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నారు. మొత్తానికి.. రౌడీ సింపుల్ సిటీకి బాలీవుడ్ ఫిదా అయింది. 

విజయ్ మాట్లాడుతూ..  ఈ సినిమాలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. లుక్స్‌ పరంగా చూస్తే వందమందితో ఒకేసారి పోరాటం చేయగలిగేలా కనిపిస్తా. కానీ, తడబడకుండా ‘ఐ లవ్‌ యూ’ కూడా చెప్పలేను. ఎందుకంటే ఇందులో నా పాత్రకు నత్తి ఉంటుంది. నత్తిగా మాట్లాడటానికి మొదటి మూడు రోజులు చాలా కష్టపడ్డా… ఆ తర్వాత మాత్రం మస్త్ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు.

#VijayDeverakonda wears chappals at the #Liger trailer launch event, #RanveerSingh can’t stop himself and trolls him for it, says, ‘Bhai ka style dekho’ – watch! @RanveerOfficial pic.twitter.com/sTf9CYYrIh— ETimes (@etimes) July 22, 2022