‘మోదీ-ఈడీ’.. కేటీఆర్ మరో సటైరికల్ ట్వీట్
ఈ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న సటైరికల్ ట్వీట్స్ నెటిజన్లను విపరీతంగా కట్టుకుంటున్నాయి. సీఎం కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“తెలంగాణ బీజేపీ చీఫ్ బీఎస్ కుమార్‌ను ఈడీ చీఫ్‌గానూ నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్ని నడిపిస్తున్న డబుల్ ఇంజిన్ ‘మోదీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది’’ అని కేటీఆర్ ట్విట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గురువారం ఈడీ ముందు హాజరైన సోయాను.. మరోసారి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈడీ విచారణ తప్పదని బండి సంజయ్ కామెంట్ చేశారు. దానిపై తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
Dear @PMOIndia
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty— KTR (@KTRTRS) July 22, 2022