నితిన్ సినిమా నాని చేతికి !

నితిన్ సినిమాలో నాని కనిపించబోతున్నాడు. అలాగని ఇదో మల్టీస్టారర్ సినిమా కాదు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి విభిన్నమైన సినిమాలు తీస్తుంటాడు. ఆయన నుంచి ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, సాహాసం, ‘ మనమంతా’ లాంటి సినిమాలొచ్చాయి. తన తదుపరి సినిమా కోసం ఓ విభిన్నమైన కథని రెడీ చేసుకొన్నాడు యేలేటి. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా కోసం గోపీచంద్, సాయిధరమ్ తేజ్ పేర్లు వినిపించాయి. ఆఖరికి ఈ సినిమా కోసం నితిన్ సెట్టయ్యాడు. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకొన్నాడనే న్యూస్ బయటికొచ్చింది. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పుడీ కథ నాని దగ్గరు వెళ్లినట్టు సమాచారమ్. యేలేటి నానికి కథ చెప్పడం.. ఆయన ఓకే చేయడం జరిగిపోయినట్టు తెలిసింది. ప్రస్తుతం నాని నాగ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ కు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.