మిస్టరీ గర్ల్ తో హృతిక్ పెళ్లి

బాలీవుడ్ కల్చర్ కు నిలువెత్తు నిదర్శనం ఈ ఫోటో. విడిపోయిన విడి విడిగా ఉంటున్న హృతిక్ రోషన్ – సుసానే ఖాన్ కొత్త భాగస్వామిని ఎంచుకున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. సబా ఆజాద్ తో కలిసి హృతిక్ డిన్నర్ పార్టీలు, హాలీడేస్ టూర్ కి వెళ్తున్నాడు.

మరోవైపు సుసానే ఖాన్ గోనీతో కలిసి డేటింగ్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ రెండు జంటలు ఓపెన్ గా ఒక్కటయ్యాయి. గోవాలో మస్త్ గా ఎంజాయ్ చేస్తూ.. సందడి చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిక్సిడ్ బిర్యాని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం అప్పట్లో వైరల్ అయింది.

ఇక మిస్టరీ గర్ల్ తో హృతిక్ రోషన్ బంధం రోజురోజుకి బలపడినట్టు కనిపిస్తోంది. వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ రూమర్స్ మరీ ఎక్కువయ్యాయి. అయితే ఆదివారం ఉదయం సబా ఆజాద్-హృతిక్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. తమ వెకేషన్ ముగించుకొని తిరిగొస్తుండగా.. మీడియా కవర్ చేసింది. ఎప్పటిలాగానే .. సభా చేయి పట్టుకొని.. చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ సమయంలో పెళ్లి గురించి మీడియా ప్రశ్నించిన.. హృతిక్ దాటవేసే రీతిలో ఆన్సర్ చేసినట్టు తెలిసింది.