పఠాన్.. దీపిక ఫస్ట్ లుక్

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘పఠాన్’. దీపికా పదుకొనే హీరోయిన్. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో మెరవనున్నాడు. జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ తో తెరకెక్కిన 50వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా నుంచి షారుఖ్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ‘పఠాన్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు.

తాజాగా ఈ సినిమా నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ వదిలారు. గన్ ఎక్కుపెట్టి.. యాక్షన్ మూడ్ లో దీపిక కనిపిస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో పఠాన్ రిలీజ్ కానుంది. దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను అన్ని బాషల్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీపికా పఠాన్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ క్ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

#DEEPIKAPADUKONE first look from #PATHAAN pic.twitter.com/W04mKQG4QG— OTTRelease (@ott_release) July 25, 2022