సోనాలీ బింద్రే వింటేజ్ లుక్

సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన హీరోయిన్. ఆమె నటించిన మురారి, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఇష్టంగా చూస్తారు. ఇక క్యాన్సర్ బారినపడి కోలుకున్న సోనాలీ.. మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆమె నటించిన ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌సిరీస్‌లో ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రోజుకో అవుట్ ఫిట్ లో దర్శనమిస్తోంది.. ఈ సీనియర్ హీరోయిన్. 

తాజాగా వింటేజ్ లుక్ లో ఆకట్టుకుంది. 20 సంవత్సరాల క్రితం కోటు ధరించింది. ఇరవై ఏళ్లయిన కోటు, తాను మారలేదు. ఇప్పటికీ కంఫర్ట్ ఉందని రాసుకొచ్చింది సోనాలి. ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం సోనాలీ పేరు వినిపించింది. అయితే ఈ ప్రచారాన్ని సోనాలి కొట్టిపారేసింది. తారక్ సినిమా కోసం తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. రానున్న రోజుల్లో సోనాలి మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశాలు లేకపోలేదు.