ఇక లవ్ స్టోరీ చేయను
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచే మనసులాంటి లవ్‌స్టోరీలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సీతా రామం. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచింది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ మాట్లాడుతూ.. ప్రేమకథలు వినీవినీ అలసిపోయానని… ఇక లవ్ స్టోరీలు చేయకూడదని అనుకున్న సమయంలో హను రాఘవపూడి చెప్పిన స్టోరీ విని కాదనలేకపోయానన్నారు. “ఈ కథ చాలా అందంగా, అద్భుతంగా ఉండటంతో చేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఇదే నా చివరి లవ్‌స్టోరీ కావచ్చు. హను ఓ మంచి అభిరుచి కలిగిన ఫిల్మ్ మేకర్. మేము చాలా అందమైన లొకేషన్లకు వెళ్లాం. గతంలో నేనెప్పుడూ వెళ్లలేదు. సినిమాలోని క్యారెక్టర్లతో ఎంతగా కనెక్ట్ అయ్యామంటే మేమంతా ఆ పేర్లతోనే పిలుచుకునేవాళ్లం” అని దుల్కర్ చెప్పాడు.