హైదరాబాద్ లో #RC15 షూటింగ్

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా (#RC15) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. విక్టోరియా మెమోరియల్ హోమ్‌లో ఈ సినిమా షూట్ చేస్తున్నారు.

తాజా షెడ్యూల్ లో హీరోయిన్ కియారా అద్వానీ జాయిన్ అయిందా ? లేదా ? అన్నది తెలియదు. కానీ, రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఓ మేడపై వేసిన చిన్న టెంట్ లోకి ఆయన వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ లుక్ ఇటీవల బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అది పూర్తి స్థాయిలో కాదు. హెయిర్ స్టైల్ చూపించారు. గ్యాంగ్ లీడర్ లో మెగాస్టార్ చిరంజీవిని తలపించింది.

ఈ సినిమా కోసం సిటిజన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యుయల్ రోల్లో నటించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అమృత్సర్, వైజాగ్‌లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్సీ 15 ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్లో ఉంది.
New leaked ….. video anna look kcpd…..
Edo gattigane plan chesadu Shankar mama….
Sorry for leak ……but cheyyalsivachindi….@AlwaysRamCharan #rc15 #ManOfMassesRamCharan pic.twitter.com/Edlk5MtfmZ— Lohith ….RC….(@LDamarasingh) July 25, 2022