మళ్లీ సన్నజాజిలా మారిన ఇల్లీ

హీరోయిన్ ఇలియానా పర్ ఫెక్ట్ ఫిగర్. శృంగార పాఠాలు చెప్పెటోళ్లు కూడా ఇలియానా ఫిజిక్ ను ఉదాహరణగా తీసుకొని చెప్పెటోళ్లు. ఒకప్పుడు టాలీవుడ్ ఏలిన హీరోయిన్ ఇలియానా. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తెలుగులో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ ఫుల్ స్వింగ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కొన్ని ఆఫర్లు అందుకున్నా.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ కొలతలు మారాయి. సన్నజాజిలా ఉండే ఈ బ్యూటీ బాగా బరువు పెరిగింది. దీంతో షేప్ అవుట్ అయింది. అయితే ఇటీవల ఫిజిక్ పై ఫోకస్ పెట్టిన ఇల్లీ.. మళ్లీ మునుపటి అవుట్ ఫిట్ ను అందుకుంది. ఈ ఆనందంలో సరికొత్త ఫోటోలు అబిమానుల కోసం షేర్ చేసింది. ఇందులో మునుపటిలా జీరో సైజ్ కు రాకపోయినా.. బాగా సన్నబడి కనిపించింది. అంతేకాదు.. మొహం మునుపటి కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానికి కారణం ఇల్లీ మళ్లీ ప్రేమలో పడటమే కారణం అంటున్నారు.  ఈ ముద్దుగుమ్మ మళ్లీ ప్రేమలో పడినట్లు సమాచారం. కత్రినా సోదరుడుతో లవ్వాటలో ఉందట.