ట్రెండీ సారా

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉంది. అమ్మ అమృతా సింగ్ తో కలిసి ఇటలీలో సరదా గడుపుతోంది. అమ్మతో కలిసి గడుపుతున్న మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంది. అదే సమయంలో ట్రెండీ లుక్ లో పర్సనల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. పింక్ కలర్ లాగు, గ్రీన్ కలర్ టీ షర్ట్ తో సూపర్ కూల్ గా కనిపిస్తోంది. సాయంత్రం వేళలో అమ్మతో కలిసి, సింగిల్ గా ఫోటోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

అదే సమయంలో సారాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రియుడుతో కలిసి ఫారిన్ చెక్కేస్తున్న హీరోయిన్లను చూస్తున్నాం. ఎయిర్ పోర్ట్ లో బాయ్.. బాయ్ చెబుతూ.. తిరిగొస్తూ హాయ్ చెబుతున్న ముద్దుగుమ్మల లిస్ట్ పెద్దది. అయితే ఇందుకు భిన్నంగా సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ తో కలిసి వెకేషన్ కు వెళ్లడంపై ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.