ఏపీలో రాష్ట్రపతి పాలనపై క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి..!!
ఏపీ హోంమత్రి నిమ్మకాయల చిన రాజప్ప కేంద్రప్రభుత్వ వైఖరిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డీజీపీ, పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. హోంగార్డుల భర్తీ, శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. సుప్రీం తీర్పు వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి తప్పుకున్నాక చంద్రబాబు పై ఒత్తిడి పెరిగిందని, వైసీపీ తో బీజేపీ చేతులు కలిపిందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. సుప్రీమ్ కోర్టులో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ చాలా దారుణమని, ప్రజల మద్దతు తమకే ఉందని ఆయన చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా నష్టం లేదన్నారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశమే లేదన్నారాయన.