అందుకే తెలుగులో వరుస ఆఫర్లు
మళయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ‘భీమ్లా నాయక్’తో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో రెండు వారసుడు, సార్ ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రాలు కాగా.. కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ స్ట్రయిట్ తెలుగు సినిమా. ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్ కు పిచ్చి పిచ్చిగా నచ్చిందని.. ఆయన రిఫరెన్స్ తో వరుస ఆఫర్లు దక్కుతున్నాయనే ప్రచారం కూడా ఉంది.
తెలుగు వరుసగా ఆఫర్లు రావడంపై ఓ ఇంటర్వ్యూలో సంయుక్తా మాట్లాడుతూ.. “తెలుగు పరిశ్రమ ఆరంభంలో రెండు మూడు అవకాశాలొచ్చినా.. కథలు నచ్చక ఒప్పుకోలేదు. తర్వాత సాయితేజ్ 15వ సినిమాలో అవకాశమొచ్చింది. అది సంతకాలు చేసిన వారానికి ‘భీమ్లానాయక్’ నుంచి పిలుపొచ్చింది. ఆ వెంటనే అదే బ్యానర్లో ‘సార్’ అవకాశం దక్కింది. ఇలా ఒకేసారి అన్ని ప్రాజెక్టులకు సంతకాలు చేయడం థ్రిల్లింగ్గా అనిపించింది. ‘సార్’ ఇప్పటికే ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సాయితేజ్ సినిమా చిత్రీకరణ దశలో ఉంది” అని చెప్పుకొచ్చింది.