రణ్ వీర్ హాలీవుడ్ సిరీస్.. త్వరలో షురూ ?

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హాలీవుడ్‌లో ఓ మినీ వెబ్‌ సిరీస్ చేయబోతున్నారట. ఓ ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్, హై బడ్జెట్ మినీ సిరీస్‌లో నటించనున్నాడట. త్వరలోనే ఈ సిరీస్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ప్రస్తుంత రణ్‌వీర్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్. కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రాలు చేస్తున్నాడు. ఇది కాకుండా శంకర్ దర్శకత్వంలో చేయనున్న అపరిచితుడు రీమేక్ కూడా ఈ వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాకు రణ్ వీర్ డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇటీవల రణ్‌వీర్ నగ్న చిత్రంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేపాడు. పేపర్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన న్యూడ్ ఫొటో షూట్‌తో పెద్ద చర్చకు తెరలేపారు. కొందరు ఆయన్ని సపోర్ట్ చేస్తుంటే..మరికొందరు విమర్శలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ? బోల్డ్ హీరోయిన్స్ నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది.