బన్నీ యాడ్.. త్రివిక్రమ్ కు 45 లక్షలు
ఓ సినిమా చేయడం కంటే.. ఓ స్టార్ హీరోతో కమర్షియల్ యాడ్ చేయడం బాగా లాభసాటి అని తెలుస్తోంది. ఒకరోజు పూర్తయ్యే దానికి దాదాపు రూ. 40 లక్షల పైగా పుచ్చుకుంటారట దార్శకుడు. అది కూడా స్క్రిప్ట్ కాదు. ఆల్రెడీ రషెస్ తీసిన యాడ్. అలా కాపీ పేస్ట్ తీసి ఇచ్చేయాలి.
ఏదైనా కంపెనీ హీరోతో యాడ్ చేయాలనుకున్నపుడు ముందుగా ఒప్పందానికి వస్తాయి. తరువాత తమ తమ క్రియేటివ్ కన్సల్టెంట్ లతో యాడ్ కాన్సెప్ట్ కు రూపకల్పన చేయిస్తాయి. డమ్మా యాడ్ లను తయారు చేయిస్తాయి. అప్పుడు హీరోలకు చూపించి అనుమతి తీసుకుంటాయి. ఆ తరువాత హీరో చెప్పిన దర్శకుడికి చిత్రీకరణ బాధ్యత అప్పగిస్తాయి.ఇలాంటి యాడ్ ఒకటి అల్లు అర్జున్ కి వచ్చింది. దానికి ఆయన త్రివిక్రమ్ ను ఎంపిక చేసుకున్నారు. దీనికి గానూ.. రూ. 45 లక్షలు త్రివిక్రమ్ కు అందనుందట.