రస్మిక.. ఢిల్లీ ఫ్యాషన్
బాలీవుడ్ లోనూ రష్మిక మందన హవా మొదలైంది. ఏకకాలంలో మూడు సినిమాలు మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చేస్తోంది. ఈ వారం మరో సినిమా ఆమె ఖాతాలో పడింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘స్క్రూ ధీలా’ కోసం హీరోయిన్ గా ఎంపికైంది. మరోవైపు సినీ ఫంక్షన్స్, కమర్షియల్ యాడ్ లలో తనదైన మార్క్ చాటుతోంది రస్మిక.
న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్డిసిఐ ఇండియా కోచర్ వీక్ 2022లో రష్మిక మందన తళుక్కున మెరిసింది. బ్రైడల్ రెడ్ లెహంగాలో ర్యాంప్ వయ్యారాలు ఒలకబోసింది. వరుణ్ బహల్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో రష్మిక వెరీ వెరీ స్పెషల్ గా కనిపించింది. అల్ట్రా-చిక్ బ్లౌజ్ మరియు విస్తారమైన మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ తో రష్మిక షో అదిరిపోయింది. ఇక సౌత్ లో రష్మిక పుష్ప 2, వారసుడు సినిమాల్లో నటిస్తోంది.